Skip to main content

IT Jobs: IT Jobsలో అలజడి ఉద్యోగాలు ఉంటయో పోతాయో..ఎందుకంటే?

IT Jobs,Frustrated Freshers,Offer Letter Surprise
IT Jobs

మరో ఊహించని షాక్‌..తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు!

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఆఫర్‌ లెటర్లు తీసుకొని జాయినింగ్‌ తేదీల కోసం పడిగాపులు కాస్తున్న ఫ్రెషర్స్‌కు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. జులై1, 2023 నుంచి జూన్‌ 30, 2024 మధ్య కాలానికి ఫ్రెషర్స్‌ నియమకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో ఐటీ రంగంలో నియమకాలు, ఫ్రెషర్స్‌ జాయినింగ్‌ తేదీలపై మరింత సందిగ్ధత నెలకొంది. 

కోవిడ్‌-19 సమయంలో అన్నీ రంగాలు కుదేలవుతుంటే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించింది. ఉన‍్న ఉద్యోగాలు ఊడిపోతుంటే.. టెక్కీలు మాత్రం రోజుకి రెండు, మూడు జాబులు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. ఒకనొక సమయంలో అంటే 2021 సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ 2022 మధ్య కాలంలో టెక్‌ కంపెనీలు టీసీఎస్‌, విప్రో,హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా,యాక్సెంచర్‌తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్స్‌ను నియమించుకున్నాయి. 

ముఖ్యంగా, ఆయా టెక్నాలజీ కంపెనీలు 2022- 2023 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్ధులకు ఆఫర్‌ లెటర్లను అందించాయి. ఏడాది క్రితం వారికి ఆఫర్ లెటర‍్లను అందించినా జాయినింగ్‌ డేట్‌ ఎప్పడనేది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా  ప్రతి రెండు-మూడు నెలలకు కంపెనీల్లో చేరే తేదీలను పొడిగిస్తున్నాయి.

మరికొందరు తమ ఆఫర్ లెటర్‌ల గడువు ముగియడంతో అదనంగా శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరు వారి ఆఫర్‌లను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. దీంతో జాబ్‌ మార్కెట్‌లో ఫ్రెషర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 

ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం.. గత రెండు బ్యాచ్‌లలో 20,000-25,000 మంది విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు పొందారు. కానీ సంస్థలు ప్రాజెక్ట్‌లలో తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయి. బిజినెస్‌ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్‌ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ ప్రశ్నిస్తోంది. 

తాజాగా, టీమ్‌ లీజ్‌ నివేదిక సైతం రానున్న రోజుల్లో ఫ్రెషర్‌ల నియామకం భారీగా తగ్గిపోతుందని తన నివేదికలో హైలెట్‌ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్స్‌ చేరే తేదీలు, నియమాకాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Published date : 20 Sep 2023 10:14AM

Photo Stories