Skip to main content

Indian Railway Job notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వే.. నోటిఫికేషన్ విడుదల..

Indian Railway
Indian Railway

పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక సైట్ ner.indianrailways.gov.inను సందర్శించవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తులు కూడా ఈ వెబ్ సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. నార్త్ ఈస్టర్న్ రైల్వే, గోరఖ్‌పూర్‌లో 37 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. 19 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (ఇంజనీరింగ్), 09 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (సిగ్నల్), 09 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేయబడతాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60శాతం, OBC NCLకి చెందిన అభ్యర్థులు 55 శాతం మార్కులు, SC/STలకు 50 శాతం మార్కులు ఉండాలి

దరఖాస్తు చేసే అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 33 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. దరఖాస్తు చేసుకునే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్/ఓబీసీకి ఫీజు రూ.500గా ఉంచబడింది. అయితే దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ఎస్టీ/మహిళ అభ్యర్థులకు ఫీజు రూ.250గా నిర్ణయించబడింది.

ఎంపికైన ఎక్స్ కేటగిరీ అభ్యర్థులకు నెలకు రూ. 30,000 జీతం ఇవ్వబడుతుంది. కాగా.. Y కేటగిరీ కింద ఎంపికైన అభ్యర్థులకు రూ. 27,000 జీతం ఇవ్వబడుతుంది. అయితే దరఖాస్తు చేసుకునే Z కేటగిరీ అభ్యర్థులకు రూ. 25,000 జీతం ఇవ్వబడుతుంది.

Published date : 13 Nov 2023 07:16PM

Photo Stories