Skip to main content

Free training on computer skills: కంప్యూటర్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ

Free training on computer skills,Nellore (Pogatota) Training Program,Supporting 40 Women in Nellore with Retail Supervisor Training
Free training on computer skills

నెల్లూరు(పొగతోట): పేద కుటుంబాల్లోని నిరుద్యోగులను గుర్తించి వారి విద్యార్హతల ఆధారంగా వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది మహిళలకు రిటైల్‌ సేల్స్‌ సూపర్‌వైజర్లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్‌ శిక్షణ జరుగుతోంది. శిక్షణ పూర్తి చేసిన వారికి వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నెల్లూరు వీఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఆర్‌టీపీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.272 స్టైఫండ్‌ చెల్లించనున్నారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. నాలుగు నెలలపాటు శిక్షణ ఉంటుంది.

ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పనులు పూర్తి చేసిన కుటుంబాల్లోని చదువుకున్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. డీఆర్‌డీఏ, డ్వామా శాఖల సమన్వయంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ (సిడాప్‌) ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సులోపు ఉన్న యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

గడిచిన మూడు సంవత్సరాల నుంచి 3,101 మంది నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చారు. వారిలో 2,450 మందికి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. డీఆర్‌డీఏ అధికారులు 10, ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌ తదితర చదువులు పూర్తి చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి వారికి ఎటువంటి శిక్షణలో ఇవ్వాలో గుర్తిస్తున్నారు.

శిక్షణ కార్యక్రమాలు

సీఆర్‌ఎం డొమెస్టిక్‌ నాన్‌–వాయిస్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ టెక్నిషియన్‌ (బేసిక్‌ క్లినికల్‌ ఎక్విప్‌మెంట్‌), ఫీల్డ్‌ టెక్నిషియన్‌–కంప్యూటింగ్‌, పెరిఫెరల్స్‌, ఆటోమోటివ్‌ సర్వీస్‌ టెక్నిషియన్‌, మల్టీస్కిల్‌ టెక్నిషియన్‌, టూర్‌ మేనేజర్‌, ఈవెంట్‌ మీటింగ్‌ కాన్ఫరెన్స్‌ ప్లానర్‌, ఫెసిలిటి మేనేజర్‌ తదితర కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. 3, 6, 12 నెలల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు మెటీరియల్‌, ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్‌ అందజేస్తున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కావలిసి ఉంది.

Published date : 20 Oct 2023 08:56AM

Photo Stories