Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ 100 percent job opportunity
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్స్ ఆధ్వర్యంలో హాస్టల్‌తో కూడిన ఉచిత శిక్షణనిచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జేఆర్‌పీ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
2018 నుంచి 2023 వరకు ఉపాధిహామీ పథకంలో 100 పనిరోజులు పూర్తిచేసుకున్న కుటుంబంలోని పిల్లలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
3 నుంచి నాలుగు నెలలపాటు భోజనం, హాస్టల్‌తోపాటు ఉచితంగా శిక్షణనిచ్చి ప్రైవేటు, మల్టీనేషనల్ కంపెనీల్లో 100శాతం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వేతనం రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ఉంటుందని, నిబంధనల ప్రకారం పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటుందన్నారు.
శిక్షణాకాలంలో 90శాతం హాజరు ఉన్నవారికి రోజుకు రూ.272 చొప్పున మూడునెలలైతే రూ.24,480, నాలుగు నెలలైతే రూ.32,640 స్టైఫండ్ రూపంలో అభ్యర్థుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.
18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్, డీగ్రీ, డిప్లమా, ఐటీఐలలో పాస్ లేదా ఫెయిల్ అయి జాబ్‌కార్డు కలిగిన యువతీయువకులకు శిక్షణ ఇస్తామన్నారు.
సేల్స్ సూపర్‌వైజర్, డీటీపీ ఆపరేటర్ కోర్సులతోపాటు కంప్యూటర్ కోర్సు, కంప్యూటర్ టైపింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్ అదనంగా నేర్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు 9908482907 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
Tags
- Free training in courses
- computer courses
- Free food and accommodation
- Free training
- free training for students
- free training program
- Job Opportunity
- Free training for youth
- Free training for youth in technology
- Free training for unemployed youth
- Free Coaching
- Jobs
- Latest Jobs News
- Free Skill Training
- Free food and hostel facility
- Today News
- trending jobs
- Latest Notification
- free education
- Telangana News
- andhra pradesh news
- Google News
- india news
- india latest news
- Get Latest Photo Stories in Telugu and English
- Andhra Pradesh
- Skill Development
- Employment
- Skill Training
- Hostel Accommodation
- job opportunities
- State Skill Development Corporation
- Employment Corporation
- Department of Skill Development and Trainings
- Sakshi Education Latest News