Skip to main content

Free Training in Automobiles Engineering: ఆటోమొబైల్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

Youth Empowerment through SEMS Partnership,SEMS Collaboration with CDAP and APSSDC,Free Training in Automobiles Engineering Courses,Rural Employment Training Program
Free Training in Automobiles Engineering Courses

సింథియా : సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైం అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ (సెమ్స్‌) ఆధ్వర్యంలో సీడాప్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోని 21 నుంచి 27 ఏళ్లు కలిగిన నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

ఐటీఐ ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, డిప్లమా మెకానికల్‌ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు సీఎన్‌సీ ఆపరేటివ్‌, వెల్డింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. బీఈ, బీటెక్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజినీర్‌–మెకానికల్‌ ఆటోమెషిన్‌ ఇంజినీర్‌ కోర్సుల్లోనూ 3 నుంచి 5 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కమాండర్‌ గోపీ కృష్ణ శివ్వం తెలిపారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం, సింథియా జంక్షన్‌లో ఉన్న సెమ్స్‌ కేంద్రంలోగాని, 99481 83865, 85006 87750, 0891–2704010 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ నెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

Published date : 05 Oct 2023 07:41AM

Photo Stories