Free Coaching: ఉపాధి కల్పిస్తున్న స్కిల్ హబ్‌లు
Sakshi Education
విజయనగరం: గతంలో డిగ్రీవిద్యను పూర్తిచేశాక పీజీ సీటు రాకుంటే చదువు ఆగిపోయేది. ఇప్పుడు.. ప్రభుత్వం నియోజకవర్గానికో స్కిల్‌హబ్‌ను ఏర్పాటుచేసి నిరుద్యోగులకు వివిధ కంపెనీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తోంది. నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్ది.. జాబ్‌మేళాల్లో కంపెనీలే కాళ్లదగ్గరకు వచ్చి ఎంపిక చేసుకునే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులకు విరివిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడంతో పేద కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు ప్రసరిస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని స్కిల్‌హబ్‌లలో శిక్షణ పొందిన సుమారు 3,000 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
Published date : 01 Sep 2023 01:22PM