Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 30 రోజుల పాటు పురుషులకు ఉచితంగా పొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన పురుషులు శిక్షణకు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 94949 51289, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Tags
- Free training
- free training in photography and videography
- free training in photography
- photography course
- 30days free course
- Photography Fundamentals
- outdoor Photography
- Studio Lighting
- Fashion Photography
- Live Event Photography
- Photo Editing
- video editing
- Photographer
- Videographer
- Photography Courses
- Digital Photography
- Modeling Photography
- training news
- Free tranding news
- Today News
- Latest News Telugu
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- india news
- trending india news
- Google News
- chandragiri
- UnionBank
- TrainingInstitute
- FreeTrainingClasses
- free trainings
- skill trainings
- career growth
- sakshieducation updates