Constable Certificate Verification: కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు...కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..
ఆదిలాబాద్: ఇటీవల వెల్లడైన కానిస్టేబుల్ తుది ఫలితాల్లో ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ప్రారంభమైంది. ప్రక్రియను ఎస్పీ డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు తమ సర్టిఫి కెట్లు, ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వివరాలతో కూడి న డాక్యుమెంట్లను గజిటెడ్ అధికారి సంతకంతో కూడిన మూడు సెట్లు, ఆరు ఫొటోలు, ప్రతీ జిరాక్స్ పై స్వీయ ధ్రువీకరణతో అందించాలని సూచించా రు.
క్రవారం కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్, టీ ఎస్‌ఎస్పీ విభాగాల్లోని మిగతా ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపా రు. జిల్లాలో సివిల్ విభాగంలో 149 మంది, ఏఆర్ విభాగంలో 84 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించగా, ధ్రువీకరణ ప్రక్రియకు సివిల్ విభాగా నికి సంబంధించి నలుగురు, ఏఆర్ విభాగానికి సంబంధించి ఒక అభ్యర్థి గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు సంజీవ్‌కుమార్, మురళి, ఆశన్న, ప్రసాద్, హెడ్ క్వార్టర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ నవీన్, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
- ts police constable certificate verification
- Constable exams
- Constables
- constable Jobs
- certificate verification
- ts police constable certificate verification dates
- Police constable
- Constable Posts
- Hyderabad
- trednding Constable news
- Selection Process
- Official verification process
- Adilabad constable final results
- District center verification
- Results
- Sakshi Education Latest News