Skip to main content

Beauty Training: బ్యూటీషన్‌పై శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

బ్యూటీషన్‌పై శిక్షణ ఇచ్చేందుకు బ్యూటీషన్‌ కోర్సులో శిక్షణ పొందిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సావిత్రి తెలిపారు.
 Women and Child Welfare Department   Opportunity for Women in Beautification Training  Beauty Training in Komaram Bheem District   Beautification Training Applications Invitation

మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో కొనసాగుతున్న కొమరం భీమ్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు 45 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందన్నారు.

అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 8 వరకు సాయంత్రం 5 గంటల్లోగా విద్యార్హత, శిక్షణ ధ్రువపత్రాలతో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వయస్సు 35 లోపు ఉండాలని, స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నా రు. 45 రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత ట్రైనర్‌కు రూ.30 వేల వేతనం అందిస్తామని, వివరాలకు 89194 15934లో సంప్రదించాలని కోరారు.

Published date : 07 Feb 2024 08:35AM

Photo Stories