Skip to main content

Army Job 2023: August 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

నరసరావుపేట ఈస్ట్‌: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Army Job 2023
Army Job 2023

సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహించనున్న ర్యాలీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆర్మీ ఉద్యోగం కోసం వేలాది మంది అభ్యర్థులు తరలిరానున్నారని తెలిపారు. ఆర్మీ ర్యాలీ నిర్వహించే డడీఎస్‌ఏ స్టేడియంలోకి ఆయా తేదీలలో సాధారణ పౌరులకు అనుమతి లేదని చెప్పారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ర్యాలీ పూర్తయిన అనంతరం ప్రజలను స్టేడియంలోకి ఎప్పటిలాగానే అనుమతిస్తారని చెప్పారు.

Also read: ITI Job Mela 2023: August 18న వెంకటగిరిలో జాబ్‌ మేళా

Published date : 17 Aug 2023 05:58PM

Photo Stories