14న అప్రెంటిస్‌షిప్ మేళా

ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో ఈ నెల 14న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లండ సుధాకర్‌రావు చెప్పారు. ఐటీఐలో శక్రవారం వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుందని అన్నారు. హాజరయ్యే అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల రెండు సెట్ల జిరాక్సులతో రావాలన్నారు. బయోడేటా ఫారం, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరా క్సులు ఉండాలని, రెండు కలర్ ఫొటోలు అవసరమని తెలిపారు.
అరబిందో ఫార్మా, రెడ్డీస్ ల్యాబ్, నాగార్జునా అగ్రికెం, స్మార్ట్ కెం, ఉషోదయ పబ్లికేషన్స్ వంటి 12 కంపెనీలు హాజరవుతాయని పేర్కొన్నారు. రెండేళ్ల ఐటీఐ కోర్సు లు పూర్తిచేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు విద్యా ర్థులు ఫోన్ నంబర్లు 9666841306, 9441944549లను సంప్రదించాలని చెప్పారు.