Skip to main content

Anganwadi jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలు

Parvathipuram ICDS Opportunities  Anganwadi jobs  Anganwadi Assistants Recruitment   ICDS Job Openings
Anganwadi jobs

పార్వతీపురం ఐసీడీఎస్‌ పరిధిలో ఏడు అంగన్వాడీ కార్యకర్తలు, 19 సహాయకులు, 8 మినీ అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీఓ ఎంఎన్‌ రాణి సోమవారం తెలిపారు. పార్వతీపురం డివిజన్‌లోని కొమరాడ ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త, ఐదు సహాయకులు, ఒక మినీ అంగన్వాడీ పోస్టుకోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అలాగే పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త, రెండు అంగన్వాడీ సహాయకులు, ఒక మినీ అంగన్వాడీ పోస్టులు, పాచిపెంట ప్రాజెక్టు పరిధిలో మూడు అంగన్వాడీ కార్యకర్త, ఆరు అంగన్వాడీ సహాయకులు, నాలుగు మినీ అంగన్వాడీ పోస్టులు, సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్‌వాడీ సహాయకురాలి పోస్టు, ఒక మినీ అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు.

పాలకొండ డివిజన్‌లోని కురుపాం ప్రాజెక్టు పరిధిలో రెండు అంగన్వాడీ కార్యకర్తలు, నాలుగు అంగన్వాడీ సహాయక పోస్టులు, ఒక మినీ అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 21 నుంచి 35ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈనెల 6 నుంచి 14వ తేదీ సాయంత్రం లోగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

Published date : 07 Dec 2023 08:07AM

Photo Stories