Inspiring Students: సైన్స్ సెమినార్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని పులివెందుల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో గరువారం చిరుధాన్యాలు మంచి పౌష్టికాహారమా లేక ఆహార వ్యామోహమా అనే అంశంపై జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. దీనికి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము సిద్దం చేసిన పోస్టర్లు, చార్ట్‌లు, పీపీటీలను ఇంగ్లీషు, తెలుగు బాషల్లో ప్రజంటేషన్ చేశారు. ఫుడ్ అండ్ టెక్నాలజీ యూనివర్సీటి నుంచి వచ్చిన ప్రొఫెసర్లు ఏడుకొండలు, జయమ్మ, పావనదీప్తిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా వారు ప్రదర్శనలు పరిశీలించి ముగ్గురు విద్యార్థులను జిల్లా టాపర్స్ (విజేతలు) గా ప్రకటించారు. ఇందులో వేంపల్లె ఉషాకిరణ్ హైస్కూల్‌కు చెందిన హర్షిణి ప్రథమస్థానంలో నిలిచింది.కడప చెమ్ముమియాపేట బాలికల హైస్కూల్‌కు చెందిన భ్రమరాంబిక ద్వితయ, నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూల్‌కు చెందిన హాసిని తృతయస్థానంలో నిలిచారు.హర్షిణి ఈ నెల 25న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది.