Telangana Sankranthi Holidays List 2024 : ఈ సారి సంక్రాంతి పండగ సెలవులు ఇవే.. అదనంగా మరో రెండు రోజులు పాటు కూడా..
ఈ సారి తెలంగాణలో సంక్రాంతి సెలవులు నాలుగు నుంచి ఆరు రోజులు పాటు రానున్నాయి. జనవరి 13వ తేదీన రెండో శనివారం చాలా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. అలాగే జనవరి 14వ తేదీన భోగి పండగ.. ఆదివారం వచ్చింది. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండగ.. సాధారణంగా సెలవులు ఉంటుంది. అలాగే జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో స్కూల్స్, కాలేజీలకు దాదాపు 6 రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
న్యూ ఇయర్ వరుసగా రెండు రోజులు సెలవులు..?
ప్రతి ఏడాది సాధారణంగా జనవరి నెలలో స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు భారీగా సెలవులు వస్తున్న విషయం తెల్సిందే. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కానుంది. 2024 న్యూ ఇయర్ సోమవారం వచ్చింది. దీంతో న్యూ ఇయర్‌కి వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఎలా అంటే.. డిసెంబర్ 31 ఆదివారం.. జనవరి 1వ తేదీ సోమవారం.. ఈ ప్రకారంగా వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం జనవరి 1వ తేదీ ఇచ్చిన సెలవును.. ఫిబ్రవరి 10వ తేదీ రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది.
రిపబ్లిక్ డే సైతం..
ఇదే నెల జనవరి 26 తేదీన రిపబ్లిక్ డే సైతం ఉన్న విషయం మీ అందరికి తెల్సిందే. రిపబ్లిక్ డే శుక్రవారం వచ్చింది.. స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు ఈ సెలవును ప్రభుత్వం అధికారికం ప్రకటించింది. ఈ ప్రకారంగా చూస్తే.. వచ్చే ఏడాది జనవరి నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఇలా ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఈ నెలలో రానున్నాయి. మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి.
Tags
- telangana sankranthi holidays 2024
- telangana sankranthi holidays 2024 news telugu
- ts sankranthi holidays 2024 for schools
- telangana new year holidays 2024
- telangana new year holidays 2024 news telugu
- republic day 2024 holidays news telugu
- republic day 2024 news telugu
- sankranti festival holidays 2024
- sankranti festival holidays 2024 news telugu
- sankranti festival holidays 2024 schools
- sankranti festival holidays 2024 colleges
- sankranti festival holidays 2024 office
- sankranti 2024 holidays in telangana
- telengana sankranthi holidays list
- Sakshi Education Latest News