Skip to main content

Foriegn Education: ఇలా చేస్తే ఈజీగా విదేశీవిద్య‌ను పూర్తి చేయొచ్చు... అయితే వీరికి మాత్ర‌మే

డిగ్రీ తరువాత విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆసక్తి ఉండి, ఆర్థికంగా వెనకబడిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. రూ.20లక్షల రుణాన్ని రెండు విడతల్లో అందించి వారి అభివృద్ధికి తోడ్పాటునిస్తోంది.
Foriegn Education
Foriegn Education

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ విద్యానిధి, బీసీలకు మహాత్మా జ్యోతిబాఫులే విద్యానిధి పథకాలు భరోసానిస్తున్నాయి. 2014–15 ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీలకు, 2015–16నుంచి మైనార్టీల కు, 2018నుంచి బీసీలకు ఈ పథకాలు అమలు చేస్తున్నారు. 
చేయూతనిస్తున్నా... అంతంతే...
విదేశీవిద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటుంది కొందరే. విద్యాసంవత్సరం ముగిసేదశలో సంక్షేమశాఖల పరిధిలోని అధికారులు, కళాశాలల యాజమాన్యం విదేశీ విద్యపై అవగాహన కల్పిస్తే చాలా మంది విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి కనబరిచే అవకాశముంది.

చ‌ద‌వండి: ఏపీ పీజీఈసెట్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది... ప‌రీక్ష ఎప్పుడంటే
పది దేశాల్లోనే పథకం అమలు..
ఈ పథకం ద్వారా చదివేందుకు మనం దేశం నుంచి పది దేశాలకే అనుమతిస్తున్నారు. ఇందులో దక్షిణ కొరియా, అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ దేశాల్లో మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ఇక్కడ వైద్య ,విద్య, ఇంజినీరింగ్‌, మేనేజ్మెంట్‌, ప్యూర్‌సైన్స్‌, వ్యవసాయం, సోషల్‌ సైన్సెస్‌, హ్యూమానిటీస్‌, తదితర కోర్సుల్లో పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది.
అర్హతలు ఇలా...
-
ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజిక శాస్త్ర కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఈ కోర్సుల్లో 60శాతానికి పైగా మార్కులు సాధించాలి.
- టోఫెల్‌లో 60శాతం. ఐఈఎల్టీటీఎస్‌ 80మార్కులు, జీఆర్‌ఈ, జీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి పీఈటీలో 50శాతం అర్హత మార్కులు ఉన్నవారికి అవకాశం.
- విద్యార్థుల వయసు 35 ఏళ్లలోపు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండాలి.

చ‌ద‌వండి:​​​​​​​ ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా?
దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలు...
కులం, ఆదాయం, జనన ధ్రువీకరణపత్రాలు, ఆధార్‌ కార్డు, పదో తరగతి, డిగ్రీ, ఇంటర్‌, పీజీ మార్కుల జాబితాలతోపాటు టోఫెల్‌, ఐఈఎల్‌, టీఎసీఆర్తోస్‌ఈ, జీమ్యాట్‌, పీఈటీ అర్హత కలిగి ఉండాలి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశ అనుమతిపత్రం, ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు, వీటి ఆధారంగా మీసేవా కేంద్రంలో గానీ, ఆన్‌లైన్‌లో తెలంగాణ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంపును అతికించి రిజిస్ట్రార్‌ సంతకంతో కూడిన పత్రాన్ని ఆదాయ ధ్రువపత్రానికి జత చేసి దరఖాస్తు సమర్పించాలి. ఆయా సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శుల నేతత్వంలోని కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. గడువు అంటూ ఉండదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published date : 17 Mar 2023 01:42PM

Photo Stories