TS Dussehra Holidays 2022 : తెలంగాణలో స్కూల్స్‌కు దసరా సెలవులు తగ్గించే ఆలోచన.. ఎందుకంటే..?
9,10 తరగతుల విద్యార్థులకు దసరా సెలవులను తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పాఠశాలలకు ఇప్పటికే ఖరారు చేసిన దసరా సెలవుల్ని తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు సూచించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
AP Schools Dussehra Holidays : ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..? తెలంగాణలో మాత్రం..
ఈ సంవత్సరం వర్షాల వల్ల..
జూలైలో వర్షాలు, సెప్టెంబర్ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, దీంతో ఆ సెలవు దినాలను భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మరో ప్రతిపాదన పాఠశాల విద్యాశాఖ ముందు ఉంచింది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
➤ Dussehra Holidays : దసరా పండుగకు 22 రోజులు సెలవులు.. ఇక స్కూల్స్, కాలేజీ పిల్లలకు అయితే..
ముఖ్యంగా సిలబస్ పూర్తి కాకపోవడంతో..
సెలవులను తగ్గించాలనే ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం అవుతుండటమే. గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది సిలబస్పై పడినట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందట. అందుకే దసరా సెలవులను ఆయా తరగతులకు కుదించాలని చూస్తున్నట్లు సమాచారం.
➤ TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..