Skip to main content

Jobs: 50 వేల ఉద్యోగాలు లక్ష్యం!

రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో 50 వేల ఉద్యోగాలు కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
KTR
హైదరాబాద్‌లో ‘మాస్‌ మ్యూచువల్‌’ కేంద్రాన్ని ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా సంస్థ మసాచ్యుసెట్స్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ (మాస్‌మ్యూచ్‌వల్‌) హైదరాబాద్‌లోని గచి్చ»ౌలిలో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలను తీసుకొస్తామన్నారు. దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కేంద్ర బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఐ) కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు.

భాగ్యనగరం బెంగళూరులా కాదు..

హైదరాబాద్‌ను అసలైన కాస్మోపాలిటన్ నగరంగా ఆయన అభివరి్ణంచారు. రాజకీయంగా ఏకీభవించనప్పటికీ మునావర్‌ ఫారూకీ, కునాల్‌ కామ్రా వంటి స్టాండప్‌ కమెడియన్లు హైదరాబాద్‌లో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే తాము రద్దు చేయబోమని పరోక్షంగా బెంగళూరులో ఉదంతాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: 

Germany: లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?

Badminton: ఎవరి జీవిత విశేషాలతో షట్లర్స్‌ ఫ్లిక్‌ పుస్తకాన్ని రూపొందించారు?

కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన హీరో మహేశ్‌బాబు

Published date : 18 Dec 2021 03:49PM

Photo Stories