Tirupati Science Centre: 29 నుంచి సమ్మర్ హాబీ క్యాంప్
Sakshi Education
తిరుపతి(అలిపిరి): తిరుపతి సైన్స్ సెంటర్‌లో ఈనెల 29 నుంచి జూన్ 8వ తేదీ వరకు ‘సమ్మర్ హాబీ క్యాంప్’ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని.. సమ్మర్ క్యాంప్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్సు, ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రానమీ, రోబోటిక్స్ సబ్జెక్టులు ఉంటాయని పేర్కొన్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ క్యాంపు తరగతులను సద్వినియోగం చేసుకోవచ్చని.. సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 0877–2286202, 7989694681ను సంప్రదించాలని కోరారు.
Published date : 08 Apr 2024 04:20PM
Tags
- Tirupati Science Centre
- Summer Hobby Camp
- Coordinator Srinivasa Nehru
- Summer Camp
- Physics subjects
- Chemistry subjects
- Bioscience subjects
- Electronics subjects
- Astronomy subjects
- Robotics subjects
- subjects
- Students
- Education News
- andhra pradesh news
- SummerHobbyCamp
- TirupatiScienceCenter
- SrinivasaNehru
- Dates:29thJuneTo8thJune
- Organized
- statements
- sakshieducation updates