10th Board Exam Inspection : టెన్త్ బోర్డు పరీక్షలు ప్రారంభం.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు.. ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశాలు!

ఐరాల: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. బుధవారం మండలంలోని అగరంపల్లె జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మార్చి 17 నుంచి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 1వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
కేంద్రాల్లో వసతులు..
జిల్లాలో 118 కేంద్రాల్లో సుమారు 21 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలుకు హాజరవుతున్నారన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికిల్ కిట్ అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగానే చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయడంతో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్‌కుమార్, ఎంఈఓ రుషేంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth board exams
- board exams 2025
- ap tenth board exam centers
- exam centers inspection
- collector incharge inspection
- strict insturctions
- mass copying
- strict warning on mal practices
- 118 exam centers for tenth exams
- basic facilities for tenth exams centers
- sudden inspection of collector incharge
- Education News
- Sakshi Education News