Skip to main content

Success with Talent and Hardwork: కసిగా ప్రతిభను కనబరచండి.. ఎదుటివారికి స్పూర్తిగా నిలవండి..

ఒక రంగంలో మనం ఫెయిలైతే, మనం మరో మార్గాన్ని వెతకాలి. అది చదువైనా, ఇంకేదైనా..
AP Inter Exam Results   Students Celebrate Success  Talented Students Achieving High Ranks in AP Inter Exams  Success is possible only with talent and hardwork but not only education

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇటీవలె ఏపీ ఇంటర్‌ విద్యార్థులు రాసిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కొన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో చాలామంది నెగ్గారు, కొందరు తమ ప్రతిభ చాటి అత్యుత్తమ మార్కులతో ర్యాంకులను సాధించారు. వారందరినీ, అధికారులు, కళాశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రలంతా సంతోషంతో అభినందించారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించినందుకు గొప్ప ఆనందాన్ని ఇచ్చారని వారంతా తమ ఆనందం వ్యక్తం చేశారు.

Driving Class: రేపటి నుంచి డ్రైవింగ్‌ ట్రైనింగ్‌.. ఎక్కడ..?

ఆలోచన ముఖ్యం..

ఇదిలా ఉంటే, కొందరు ఫెయిల్‌ అయిన విద్యార్థులు మరోసారి పరీక్షలను రాసేందుకు సిద్ధపడితే కొందరు మాత్రం మనస్తాపానికి గురై ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులోనిదే ఆత్మహత్యలు, వేర్వేరు అలవాట్లకు బానిసకావడం లాంటివి. విద్యార్థులు.. ఈసారి కాకపోతే మరోసారి పరీక్షను రాసి పాస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారంతా, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు తమ తల్లిదండ్రుల గురించి మొదట ఆలోచించాలి. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచిస్తే మీ నిర్ణయాల్లో మార్పు ఉంటుంది. దీంతోపాటు మీ జీవితం చాలామందికి స్కూర్తినిస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే తమకు దగ్గరగా ఉన్న వ్యక్తితో తమ బాధను చెపితే అందుకు పరిష్కారం వెంటనే దొరక్కపోయినా, మనలో సరైన ఆలోచనలు ప్రారంభమవుతాయి.

10th Exam Papers Evaluation: రేపు పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..

ప్రతిభను కనబరచండి..

ఇంటర్‌లో ఫెయిల్‌ అయినప్పటికీ చాలామంది ప్రస్తుతం గొప్ప గొప్ప స్థానంలో నిలిచి అందరికీ స్పూర్తిదాయకులయ్యారు. ఇంటర్‌ చదవలేక చాలామంది వారి ప్రతిభను గుర్తించే మరో రంగంలో నిలిచారు. చాలామంది ఇంటర్‌ విద్యార్థులు గతంలో ఫెయిల్‌ అయినా సరే మరోసారి పరీక్షలు రాసి పాసయ్యారు. విద్యార్థులంతా తమ ప్రతిభను కనబరిచే దారిలో నడచి నిరూపించుకోవాలి కాని తప్పుడు నిర్ణయాలతో తమ కుటుంబానికి బాధను మిగిలించకూడదు. ఇది ఒక్క ఇంటర్‌ ఫలితాల విషయంలో మాత్రమే కాదు, జీవితంలో ఎన్నో సమస్యలను ఎదురుకుంటాం వాటిని దాటి నడిచేందుకు ధైర్యంగా నిలవాలి అందరికీ ధైర్యం ఇచ్చేంతలా ఎదగాలి.

KGBV Rankers: ఇంటర్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన కేజీబీవీ విద్యార్థినులు..

Published date : 15 Apr 2024 11:02AM

Photo Stories