Students: ‘ఔట్ రీచ్’తో పరిశ్రమల వైపు విద్యార్థులు
Sakshi Education
కాజీపేట అర్బన్: విద్యార్థులను పరిశ్రమల వైపు మళ్లించేందుకు ఔట్ రీచ్ కార్యక్రమం తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. యూఎస్‌కు చెందిన బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ సౌజన్యంతో ఔట్ రీచ్ పేరిట నిట్ సెమినార్ హాల్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని డైరెక్టర్ అక్టోబర్ 11న బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు బోయింగ్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్ కిశోర్‌కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: PG Medical Counselling: పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో అక్రమాలు
Published date : 12 Oct 2023 05:26PM