Skip to main content

NIT SPL-23: నిట్ లీగ్‌లో విద్యార్థుల ఉత్సాహం

రీసెర్చ్ స్కాల‌ర్స్ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ లీగ్ ను నిర్వ‌హించారు. ఇందులో భాగంగా బిద్యాధ‌ర్ సుబుదీ మాట్లాడుతూ..
National Invitation Tournament league
National Invitation Tournament league

సాక్షి ఎడ్యుకేష‌న్: నిట్‌లో ఎస్పీఎల్‌–23 (స్కాలర్స్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ను టాస్‌ వేసి మంగళవారం నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ ప్రారంభించారు. రీసెర్చ్‌ స్కాలర్స్‌ అండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లీగ్‌లో విద్యార్థులకు ఉత్సాహాన్ని కల్పించేందుకు బిద్యాధర్‌ సుబుదీ కాసేపు బ్యాటింగ్‌ చేశారు.

nit

Internship Offer: ఏయూలో ఇంట‌ర్న‌షిప్ డ్రైవ్ నిర్వాహ‌ణ‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిట్‌ వరంగల్‌ పీఈడీ ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా ఎస్పీఎల్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడు రోజుల పాటు నిర్వహించనున్న ఎస్పీఎల్‌–23లో పది జట్లు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. పీఈడీ హెడ్‌ ఆర్‌.దయానిధి, పీఈడీ సీనియర్‌ ప్రొఫెసర్‌ పి.రవికుమార్‌, డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ శ్రీనివాసాచార్య, ప్రొఫెసర్లు హరికృష్ణ, అబ్దుల్‌ అజీమ్‌ పాల్గొన్నారు.

 

Published date : 27 Sep 2023 06:03PM

Photo Stories