Sports State Level: సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి కోసం ఎంపికలు
సాక్షి ఎడ్యుకేషన్: ఈ నెల 16, 17, 18 తేదీల్లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగే సీనియర్ సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల, మహిళల జట్ల ఎంపిక ప్రక్రియ ఆదివారం ముగిసింది. అనంత క్రీడాగ్రామం వేదికగా సాగిన ఈ ప్రక్రియకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికలను ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సీఈఓ వెంకటేశులు పర్యవేక్షించారు.
School Facilities: పాఠశాల ఉపాధ్యాయులు సస్పెండ్.. కారణం?
మహిళల జట్టుకు టి.లక్ష్మి, బి.లావణ్య, వి.సాయిరిషిత, డి.హంసనయన, పి.స్రవంతి, టి.ధరణి, ఎస్.బ్యూలా, ఎం.కీర్తన, ఎం.దీక్షిత, జి.నాగప్రసన్నలక్ష్మి, వై.ఖ్యాతి కల్యాణి, డి.అమీదాబీ, బి.శిరీష, కె.కల్పన, బి.గౌరీప్రియ, ఎస్.మధులత, జి.కీర్తన ఎంపికయ్యారు. అలాగే పురుషుల జట్టులో బి.మహేష్. ఎం.శివకుమార్, ఈ.వరుణ్‌కుమార్, బి.పృథ్వీరాజ్, పి.అశోక్ కుమార్, కె.లోకేష్, బి.వినోద్, సి.లక్ష్మీనారాయణ, ఎన్.లక్ష్మీకళ్యాణ్, బి.షాకీర్, ఎల్.సింహాద్రి, ఎ.పవన్‌కుమార్. కె.సాయివెంకట్, జి.అరవిందరెడ్డి, ఎం.సి.రంజిత్‌కుమార్, ఎం.ధనుష్, బి.అక్షయ్‌సాగర్ చోటు దక్కించుకున్నారు. కార్యక్రమంలో నాగేంద్ర, రామకృష్ణ, ప్రభాకర్, గోపాలరెడ్డి, లతాదేవి, ఫక్కీరప్ప, రమేష్ , చంద్ర, సాయి దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.