School Facilities: పాఠశాల ఉపాధ్యాయులు సస్పెండ్.. కారణం?
Sakshi Education
పాఠశాలల్లో చదువుతో పాటు విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలి, తగిన సదుపాయాలు ఉండేలా పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే పాఠశాలలను సందర్శించారు ప్రిన్సిపల్ సెక్రెటరీ..
సాక్షి ఎడ్యుకేషన్: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్ ఇటీవల కస్పా మున్సిపల్ పాఠశాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 7వ తరగతికి చెందిన 38 మంది విద్యార్థుల్లో 10 మంది కూడా మాథ్స్, సైన్స్ సబ్జెక్టుల వర్క్‌బుక్స్ సరిగా రాయకపోవడం, అభ్యసనా సామర్థ్యాలు లోపించడాన్ని గుర్తించారు.
Sports Education: వ్యాయామ విద్యలో ప్రోత్సాహానికి వాలీబాల్ పోటీలు
అలాగే, నెల్లిమర్ల ప్రాథమిక పాఠశాలలో ఏ ఒక్క తరగతిని సక్రమంగా నిర్వహించడంలేని విషయాన్ని గమనించారు. దీనికి బాధ్యులుగా కస్పా హైస్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను, నెల్లిమర్ల ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంను సస్పెండ్‌చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసినట్టు డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.
Published date : 30 Sep 2023 02:57PM