Spot Admission in Polytechnic 2023: పాలిటెక్నిక్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని వివిధ కోర్సులలో మిగిలిన సీట్ల కోసం ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విభాగాల్లో ఖాళీల వివరాలను ఈనెల 25న ప్రదర్శిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించన్నట్లు ప్రిన్సిపాల్ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్ ఈసీఈ ఇంజనీరింగ్ విభాగాల్లో సీట్లను భర్తీ చేస్తామన్నారు. ఈనెల 25నుంచి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకొని, 28న స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలన్నారు.
Published date : 25 Jul 2023 07:38PM