Skip to main content

Govt School Students : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో వెనుక‌బ‌డిన విద్య‌ర్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

Special attention to backward students in government schools

పాడేరు: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో బోధన కార్యక్రమాలు చేపట్టాలని డీఈవో పి.బ్రహ్మాజీరావు ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థుల ప్రత్యేక బోధనకు సంబంధించి కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాడేరు డివిజన్‌లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో మూడు రోజుల ప్రత్యేక శిక్షణ జరుగుతోంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

Good News for Inter students:ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ శిక్షణ

అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అభ్యసన పెంపుదలను ఉపాధ్యాయులంతా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. డివిజన్‌ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా మండల స్థాయిలో కూడా తోటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.అన్ని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, విద్యా ప్రగతి లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎంఈవో సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Oct 2024 01:20PM

Photo Stories