ఘనంగా ఫెషర్స్ డే వేడుక.. ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ అత్తాపూర్ భాష్యం పాఠశాల ఫ్రెషర్స్ డే వేడుక జూలై 13వ తేదీన (గురువారం) ఘనంగా నిర్వహించారు.
Bhashyam School Freshers Day Celebrations
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల పోటీల్లో గెలుపొందిన వారికీ బహుమతులను ప్రదానం చేశారు.
ZEO అంకమరావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ఎన్నికల ప్రక్రియ పై అవగాహన కలిగి ఉంటే అర్హులైన అభ్యర్థులకు ఓటు వేసే తెలివి పెరుగుతుందన్నారు. మారుతున్న విద్యాప్రమాణాలకు అనుగుణంగా విద్యనందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ అయూబ్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు..సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లౌక్య గారు, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.