విదేశాల్లో ఉద్యోగాలకు రేపు రిజిస్ట్రేషన్లు
Sakshi Education
సింగరేణి(కొత్తగూడెం): జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో ఉద్యోగాల కోసం అర్హులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులు కలెక్టరేట్‌లో ఈ నెల 24న పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజేత తెలిపారు.
గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జర్మనీలో మీట్ ప్రాసెసింగ్, ఫుడ్ రిటైల్ సేల్స్, కన్స్‌స్ట్రక్షన్ వేర్‌హౌస్, ట్రక్ డ్రైవర్, ఫిట్టర్, టర్నర్, సీఎస్‌పీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయని, 60 శాతం మార్కులతో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన 22 – 28 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులని చెప్పారు. ఆస్ట్రేలియాలో మైనింగ్ ఇండస్ట్రీ, ప్లాంట్ మెకానిక్, మెకానిక్ ఫిట్టర్, మెకానిక్ ఇంజనీర్, కన్వేయర్ బెల్ట్ టెక్నీషియన్, సీఎస్‌పీ మెషినిస్ట్, వెల్డర్, బాయిలర్ మేకర్, ఫ్యాబ్రికేటర్ ఉద్యోగాలకు 40 ఏళ్ల లోపు వయసుండి, డిప్లొమా మెకానిక్, ఐటీఐ మెకానిక్ లేదా వెల్డ ర్ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
Published date : 23 Jun 2023 03:55PM