PMSS: ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మాజీ సైనిక పిల్లలకు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి ఐజె రఘురామయయ్య డిసెంబర్ 28(గురువారం) ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్‌లో 60శాతం మార్కులు తెచ్చుకుని ఈ ఏడాది ఎంబీబీఎస్/బీడీఎస్/ బీటెక్/ ఎంసీఏ వంటి కోర్సుల్లో చేరిన వారు దీనికి అర్హులన్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డు వారి వెబ్‌సైట్ www.ksb.gov.in ద్వారా జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మగ పిల్లలకు రూ.30 వేలు, ఆడ పిల్లలకు రూ.36 వేలు స్కాలర్‌షిప్ వస్తుందన్నారు.
Good News for AP Anganwadi Employees : ఏపీ అంగన్‌వాడీలకు ఉద్యోగుల జీతాలు పెంపు, గ్రాట్యుటీపై ప్రభుత్వం..?
Published date : 30 Dec 2023 12:25PM