CAT 2024 Preparation : నవంబర్ 24న క్యాట్–2024 ఎంట్రన్స్.. రివిజన్, ప్రాక్టీస్‌లో ఈ ప్రణాళిక
ఎంబీఏ, పీహెచ్‌డీ, ఇతర మేనేజ్‌మెంట్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో.. ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఏటా రెండు లక్షల మంది వరకు పోటీ పడుతున్న వైనం! ఈ ఏడాది నవంబర్ 24న క్యాట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ పరీక్షలో మెరుగైన స్కోర్ సాధించేందుకు మార్గాలపై కథనం.
క్యాట్–2024కు దాదాపు రెండు లక్షల మందికి పైగా పోటీ పడే అవకాశముంది. ఈ స్కోర్‌తో ఐఐఎంలతోపాటు పలు ప్రముఖ బి–స్కూల్స్‌లో కూడా మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం లభిస్తుంది. దీంతో ప్రతి ఏటా అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. క్యాట్ ద్వారా ఐఐఎంలో అడుగు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నెల రోజుల ప్లాన్
క్యాట్–2024ను నవంబర్ 24న నిర్వహించనున్నారు. అంటే అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 30 రోజులు మాత్రమే. ఈ సమయంలో విస్తృత అధ్యయనం బదులు రివిజన్, ప్రాక్టీస్, అనాలిసిస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. నెల రోజుల ప్లాన్‌ను సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా ఏకాగ్రతతో ప్రిపరేషన్ సాగించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
మూడు విభాగాలు.. రెండు గంటలు
క్యాట్‌ను మూడు సెక్షన్లుగా రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తామని నిర్వాహక ఇన్‌స్టిట్యూట్ ఐఐఎం–బెంగళూరు పేర్కొంది. ఇందులో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (24 ప్రశ్నలు); డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (20 ప్రశ్నలు); క్వాంటిటేటివ్ ఎబిలిటీ (22 ప్రశ్నలు) విభాగాలపై ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 40 నిమిషాల సమయం ఉంటుంది. అదే విధంగా ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంటుంది. ఐఐఎంలు.. క్యాట్‌లో సెక్షనల్ కటాఫ్‌ను కూడా నిర్దేశిస్తున్నాయి. ప్రతి సెక్షన్‌లో నిర్దిష్ట మార్కులు పొందితేనే సదరు దరఖాస్తులను తదుపరి దశకు పరిశీలనలోకి తీసుకుంటారు.
Cyclone Dana: తీవ్ర తుఫానుగా ముంచుకొస్తున్న ‘దానా’.. ఇక్కడ భారీ వర్షాలు!!
పెరుగుతున్న క్లిష్టత
ఇటీవల కాలంలో క్యాట్‌లో ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతోంది. గత ఏడాది వీఏఆర్‌సీ, డీఐఎల్‌ఆర్ నుంచి అడిగిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని నిపుణులు, పరీక్షకు హాజరైన అభ్యర్థులు చెప్పారు. డీఐఎల్‌ఆర్ సమాధానాలు సాధించేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన రావడంతో సమయాభావ సమస్య ఎదురైంది. ఒకే రోజు మూడు స్లాట్లలో జరిగే పరీక్షలో ఒక స్లాట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా, మరో స్లాట్‌లో కొంత క్లిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎలా ఉన్నా.. సమాధానాలు ఇచ్చే విధంగా సన్నద్ధత పొందాలని సూచిస్తున్నారు.
సమయ పాలన, సబ్జెక్ట్ విభజన
పరీక్షలో ప్రతి సెక్షన్‌ను 40 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.కాబట్టి అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా టైం మేనేజ్‌మెంట్ పాటించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రతి రోజు ప్రతి సెక్షన్‌కు మూడు గంటలు చొప్పున కేటాయించాలి. సిలబస్‌లో ఇప్పటికీ పూర్తి చేయని అంశాలుంటే.. వాటిని అక్టోబర్ చివరి నాటికి ముగించేలా ప్రిపరేషన్ కొనసాగించాలి మూడు సెక్షన్లకు మూడు గంటలు చొప్పున 9 గంటలు; వారానికి రెండు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరయ్యే విధంగా వ్యవహరించాలి.
☛ Follow our Instagram Page (Click Here)
మొదటి వారం నుంచి రివిజన్
నవంబర్ మొదటి వారం నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాల ప్రిపరేషన్‌ను పూర్తి చేయకపోయినా.. వాటి గురించి ఆలోచించకూడదు. పూర్తి చేసిన అంశాలపైనే మరింత పట్టు సాధించేలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి కనీసం 10 నుంచి 12 మాక్ టెస్ట్‌లకు హాజరై.. వాటిలో ప్రదర్శన తీరును విశ్లేషించుకోవాలి. దాని ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై కొంత ఎక్కువ దృష్టి పెట్టాలి. అన్ని సబ్జెక్ట్‌లకు ప్రిపరేషన్ పరంగా సమతుల్యత పాటించే విధంగా వ్యవహరించాలి.
స్పీడ్ కాలిక్యులేషన్ స్కిల్స్
పరీక్ష రోజున వీలైనంత ఎక్కువ సమాధానాలు గుర్తించేందుకు తోడ్పడేలా వేగం పెంచుకోవాలి. రీడింగ్, కాలిక్యులేషన్‌లలో స్పీడ్ ప్రాక్టీస్ చాలా అవసరం. ఈ సారి ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్ సదుపాయం ఉంది. అయితే దీని ఆధారంగా అన్ని కాలిక్యులేషన్స్ చేయొచ్చ అనే ధోరణి సరికాదు. ప్రతిదానికి ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్‌పై ఆధారపడితే సమయం వృథా అవుతుంది. కాబట్టి మెంటల్ కాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి.
Diploma Apprentice : బీఈఎల్‌లో ఏడాది డిప్లొమా అప్రెంటీస్ శిక్షణకు దరఖస్తులు
వెర్బల్ ఎబిలిటీ
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్‌లో రాణించడానికి రీడింగ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. కారణం.. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే విభాగమిది. ఒక నిర్దేశిత ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల్లోనూ అధిక శాతం ప్యాసేజ్ సారాంశం అర్థమైతేనే సమాధానం ఇవ్వగలిగేవిగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు స్పీడ్ రీడింగ్ అలవాటుతోపాటు ఒక టాపిక్‌ను చదువుతున్నప్పుడే అందులోని కీలక అంశాలను గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పంక్చుయేషన్స్ నుంచి ప్యాసేజ్ మెయిన్ కాన్సెప్ట్ వరకూ.. అన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీటితోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. ఫలితంగా ఆయా ప్యాసేజ్‌లలో వినియోగించిన పదజాలాన్ని వేగంగా అర్థం చేసుకుని నిర్దేశిత సమయంలో సమాధానాలిచ్చే నైపుణ్యం లభిస్తుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
రీడింగ్ కాంప్రహెన్షన్
క్యాట్‌లో మిగతా విభాగాలతో పోల్చితే కొంత ఎక్కువ స్కోరు సాధించడానికి అవకాశం ఉన్న విభాగం.. రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో మంచి స్కోర్ కోసం అభ్యర్థులు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడం అలవర్చుకోవాలి. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారం, ప్రశ్నార్హమైన అంశాలు, కీలక పదాలు గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదవాలి. వీటిని చదివిన తర్వాత సొంతంగా క్లుప్తంగా సారాంశాన్ని రాసుకోవాలి. వొకాబ్యులరీని పెంచుకోవడం వెర్బల్ ఎబిలిటీలో ఎంతో ఉపయుక్తం. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానంలో వర్డ్ లెర్నింగ్ వొకాబ్యులరీపై పట్టు సాధించేందుకు దోహదపడుతుంది. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవాలి. ఆయా పదాల యూసేజ్‌పైనా అవగాహన పెంచుకోవాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్
గ్రాఫ్‌లు, చార్ట్‌లు ఆధారంగా వాటిలో ఇచ్చిన డేటాకు సంబంధించిన ప్రశ్నలు అడిగే విభాగం.. డేటా ఇంటర్‌ప్రిటేషన్. ఇందులో అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థులు స్వీయ విశ్లేషణ, సూక్ష్మ పరిశీలన ఆధారంగా సమాధానం రాబట్టేవిగా ఉంటాయి. అంటే.. గ్రాఫ్‌లు, చార్ట్‌లలో ఇచ్చిన దత్తాంశాలపై నేరుగా ప్రశ్నలు అడగకుండా సంబంధిత కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని ఏ ఫార్ములా ఆధారంగా సమాధానం కనుక్కోగలమనే విధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం పర్సంటేజెస్, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. కేవలం ఒకే తరహా ప్రశ్నలు కాకుండా.. విభిన్న క్లిష్టతతో కూడిన సమస్యలను సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ANM Training Courses : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖలో ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంశాలు ఉండే ఈ సెక్షన్‌లో రాణించడానికి ముఖ్యమైన వ్యూహం వేగం. అందులోనూ కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి. నాన్–మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాబబిలిటీ అండ్ పెర్ముటేషన్స్/ కాంబినేషన్స్, నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టి పెట్టాలి.
వీటికి సంబం«ధించిన బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాస్తవానికి క్యాట్‌లో ఎదురయ్యే ప్రశ్నల్లో పది శాతం మేర ప్రశ్నలు బేసిక్స్ ఆధారంగా సొంత ఆలోచనతో చేయాల్సిన విధంగా ఉంటాయి. వీటికోసం పరీక్షలో ఎక్కువ సమయం వృథా అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా.. బేసిక్స్ ఆధారంగా ఉండే ప్రశ్నలపై దృష్టి సారించాలి. ఫార్ములా బేస్డ్ ప్రశ్నల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత సమయంలో సబ్జెక్ట్ ప్రిపరేషన్‌తోపాటు ఆయా సెక్షన్లలో ప్రీవియస్ ప్రశ్నల ప్రాక్టీస్ చేయడం మేలు.
☛ Join our Telegram Channel (Click Here)
క్యాట్–2024 ముఖ్య సమాచారం
➔ నవంబర్ 24న క్యాట్ పరీక్ష
➔ 21 ఐఐఎంలలో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం.
➔ అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: నవంబర్ 5 నుంచి 24 వరకు
➔ ఫలితాల వెల్లడి: 2025 జనవరిలో
➔ వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in
Tags
- CLAT 2024
- law exam
- preparation tips for clat exam
- hall ticket download for clat 2024
- law exam preparation
- preparation tips and planning for clat exam 2024
- Common Law Admission Test 2024
- Common Law Admission Test hall ticket download
- Education News
- Sakshi Education News
- Admissions 2024
- law college admissions test
- CAT Exam Tips
- CAT 2024 preparation
- How to crack CAT
- CAT scoring strategies
- IIM admission exam
- MBA entrance exam India
- CAT exam time management
- High score in CAT