Skip to main content

Police Constable Training 2024- పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణకు ఏర్పాట్లు, షెడ్యూల్‌ ఎప్పుడంటే..

Training staff appointed for indoor and outdoor sessions    Hyderabad Police Training College preparing for constable training  Police Constable Training 2024 Telangana Police Constable Training 2024

సాక్షి, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ శిక్షణ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ట్రైనింగ్‌ ప్రారంభించడంపై ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్, ఔట్‌డోర్‌ శిక్షణకు సంబంధించిన సిబ్బంది నియామకం తదితర అంశాలపైన డీజీపీ రవి గుప్తా ఫిబ్రవరి 6న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తొలి విడతలో వాళ్లకే ట్రైనింగ్‌
పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15,644 కానిస్టేబుల్‌ భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. వీరిలో తొలి విడతలో 4,965 మందికి సివిల్‌ కానిస్టేబుల్‌ శిక్షణ ప్రారంభించనున్నారు. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలకు సమాచారాన్ని పంపారు. ఇండోర్, ఔట్‌డోర్‌లో కనీస మౌలిక వసతుల కల్పన కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 
 

Published date : 08 Feb 2024 01:17PM

Photo Stories