PG Semester Results Released: వైవీయూ దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల
వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ తన ఛాంబర్‌లో సీడీఓఈ డైరెక్టర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్యతో కలసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ)–2020 ఆధారంగా, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)ని కలుపుకొని మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించామన్నారు.
Agniveer Posts: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అగ్నివీర్ పోస్టుల్లో అవకాశం..!
ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే ఆర్థికశాస్త్రంలో 92.9 శాతం, ఇంగ్లీష్‌లో 92.6 శాతం, చరిత్రలో 100 శాతం, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో 87.5 శాతం, రాజకీయ శాస్త్రంలో 94.5 శాతం, మనస్తత్వశాస్త్రంలో 91.3 శాతం, ప్రత్యేక తెలుగులో 92.8 శాతం, వాణిజ్య శాస్త్రంలో 85.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
పరీక్షలు ముగిసిన రెండు వారాల్లోనే ఫలితాలను ప్రకటించడంలో సీడీఓఈ బృందం వేగవంతమైన చర్యలను వీసీ ప్రశంసించారు. డైరెక్టర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఏకకాలంలో రెండు కోర్సులను అభ్యసించవచ్చన్నారు. ఒకటి ఫిజికల్ మోడ్‌లో మరొకటి ఆన్‌లైన్ విధానంలో చదవవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీడీఓఈ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీధర్ బాబు, సిబ్బంది, టి. చంద్ర శేఖర్ రెడ్డి, కె. రాజశేఖర్, ఎస్. జబీవుల్లా, జి. కనకరత్నమ్మ పాల్గొన్నారు.