Skip to main content

PG Exam Fee Dates: 12లోగా పీజీ పరీక్ష ఫీజు చెల్లించాలి

PG Regular and Sem Exam Fee dates   Telangana University PG Exam Fees Due by 12th December   Pay Your Telangana University PG Exam Fees by 12th Dec   Telangana University PG Exam Fees Deadline

తెయూ: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ రెగ్యులర్‌, సెమిస్టర్‌ పరీక్షల ఫీజును ఈ నెల 12వ తేదీ లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారిణి ఎం.అరుణ గురువారం తెలిపారు. ఎంఏ, ఎంకామ్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఐదు సంవత్సరాల ఏపీఈ, పీసీహెచ్‌, ఐఎంబీఏ కోర్సులకు సంబంధించి 3, 5, 7, 9వ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ పరీక్షలకు ఈ షెడ్యూల్‌ వర్తిస్తుందన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 15వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా తెయూ పరీక్షల నియంత్రణ అధికారి అరుణ సూచించారు. విద్యార్థులు గమనించాలన్నారు.

Published date : 09 Dec 2023 11:21AM

Photo Stories