Skip to main content

Sri Venkateswara Vedic University: వేదిక్‌ వర్సిటీలో అత్యాధునిక తాళపత్ర స్కానర్‌

Sri Venkateswara Vedic University

తిరుపతి సిటీ: శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక తాళపత్ర స్కానర్‌ను శుక్రవారం టీటీడీ ఈఓ ఏవీ.ధర్మారెడ్డి, జేఈఓ సదాభార్గవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీవేకటేశ్వర తాళపత్ర పరిశోధన సంస్థ దేశంలోనే అతిగొప్ప సంస్థగా ఎదగాలన్నారు. దానికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏవీ రాధేశ్యామ్‌, డీన్లు గోలి సుబ్రహ్మణ్యశర్మ, డాక్టర్‌ ఫణియాజులు, తాళపత్ర విభాగాధిపతి విజయలక్ష్మి, పీఆర్వో బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: ITDA: ఉపాధ్యాయుల జాబితా తయారు చేయండి

Published date : 12 Aug 2023 05:11PM

Photo Stories