Success Story: జేఎన్‌టీయూ ప్రొఫెసర్ పద్మసువర్ణ సక్సెస్ స్టోరీ..
Sakshi Education
ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రొఫెసర్, పద్మసువర్ణ ఫిజిక్స్ లో నిష్ణాతులుగా ఖ్యాతి సాధించారు. ఫిజిక్స్ విభాగంలో ఆమె చెసిన గణితలు, ప్రాజెక్టులు, విజయాలు తెలుసుకుందాం.
సాక్షి ఎడ్యుకేషన్: జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్.పద్మసువర్ణ... అప్లైడ్ ఫిజిక్స్‌లో నిష్ణాతులుగా ఖ్యాతి గడించారు. ఫిజిక్స్ విభాగాధిపతిగా పనిచేశారు. 2013–17 మధ్య కాలంలో సింథసిస్ అండ్ క్యారక్టరైజేషన్ ఆఫ్ నానో స్ట్రక్చర్డ్ కండక్టింగ్ పాలిమర్స్ ఫర్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ లిథియం బ్యాటరీస్’ అనే ప్రాజెక్ట్‌ను రూ.9.67 లక్షల వ్యయంతో నిర్వహించారు.
Andhra University: ఏయూలో అమెరికా కార్నర్ పనితీరు భేష్
ఇరాడియేషన్ ఆఫ్ స్టడీస్ ఆన్ పాలిమర్ జెల్స్ ఫర్ సోలార్ సెల్స్ అనే ఐయూఏసీ స్పాన్సర్డ్ బీమ్ టైం ప్రాజెక్ట్‌లోనూ పనిచేశారు. మొత్తం ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16 జర్నల్స్ ప్రచురించారు. ఏడు వర్క్‌షాప్‌లు నిర్వహించారు.
Published date : 05 Sep 2023 06:26PM