Andhra University: ఏయూలో అమెరికా కార్నర్ పనితీరు భేష్
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అమెరికా కాన్సులేట్ అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. హైదరాబాదులోని అమెరికా కాన్సులేట్ ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ రాఘవన్ శ్రీనివాసన్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఏయూకు విచ్చేశారు. ముందుగా ఏయూలోని అమెరికా కార్నర్‌ను సందర్శించారు. ఇక్కడ కేంద్రం పనితీరు, చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతిని అమెరికా కార్నర్ మెంటార్, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ ఎం.జేమ్స్ స్టీఫెన్ వివరించారు. రెండేళ్ల కాలంలో మొత్తం 80 కార్యక్రమాలు నిర్వహించామని, వీటిలో చాట్‌విత్ డిప్లమాట్, ప్యానల్ డిస్కషన్, బుక్ రీడింగ్ సెషన్, విభిన్న అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. ఏయూలోని అమెరికా కార్నర్ నిర్వహించిన కార్యక్రమాలు, ప్రగతిని ప్రశంసించారు. అనంతరం అంబేడ్కర్ చైర్ కార్యాలయాన్ని సందర్శించి, కార్యక్రమాలను తెలుసుకున్నారు. అనంతరం ఏయూ ఫార్మసీ కళాశాల, రసాయన శాస్త్ర విభాగం, ఏయూ ఫార్మాఇంక్యుబేషన్‌న సెంటర్ ఎలిమెంట్‌లను సందర్శించారు. తన తాత ఎస్.రంగస్వామి ఏయూ ఫార్మసీ కళాశాలకు వ్యవస్థాపకుడిగా, తొలి విభాగాధిపతిగా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఫార్మసీ కళాశాలలో రాఘవన్‌శ్రీనివాసన్‌ను సత్కరించారు.
కార్యక్రమంలో భాగంగా ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డితో కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏయూ అభివృద్ధిని వీసీ ప్రసాద రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌న్‌ఆచార్య ధనుంజయ రావు, రీసెర్చ్ డీనన్‌్ ఆచార్య కె.బసవయ్య, ఆచార్య వి.సిద్ధయ్య, ఆచార్య ఈశ్వర కుమార్, ఆచార్య రాంజీ, యూఎస్ కాన్సులేట్ కమర్షియల్ అడ్వైజర్ సునీల్ కుమార్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్పెషలిస్ట్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిని ఏయూ తరఫున సత్కరించారు.