Skip to main content

Ambedkar Overseas Vidya Nidhi: ఓవర్సీస్‌ విద్యానిధి నిబంధనలు సడలించాలి

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం నిబంధనలు సడలించాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ‌ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభిప్రాయపడ్డారు.
 Ambedkar Overseas Vidya Nidhi
ఓవర్సీస్‌ విద్యానిధి నిబంధనలు సడలించాలి

డీఎస్‌ఎస్‌ భవన్ లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సెప్టెంబర్‌ 9న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద కొన్ని నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వీటిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సడలింపు అంశాలను పరిశీలించాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యనందేలా చూడాలని చెప్పారు. సాయంత్రం ట్యూటర్లను నియమించి అభ్యసన కార్యక్రమాలను పెంపొందించాలన్నారు. 

చదవండి:
 ఓవర్సీస్‌ విద్యానిధికి 13 మంది గిరిజన విద్యార్థులు ఎంపిక

ఏపీ అంబేద్కర్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ పథకంలో పలు మార్పులు!

Published date : 11 Sep 2021 02:28PM

Photo Stories