Skip to main content

ఓవర్సీస్‌ విద్యానిధికి 13 మంది గిరిజన విద్యార్థులు ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 13 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు.
శుక్రవారం డీఎస్‌ఎస్‌ భవన్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని, విదేశాల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని కమిషనర్‌ తెలిపారు.

చ‌ద‌వండి: విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ 10% ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు

చ‌ద‌వండి: టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ తిరిగి నిర్వహించండి: హైకోర్టు
Published date : 17 Jul 2021 03:33PM

Photo Stories