Skip to main content

IIFT students: ఐఐఎఫ్‌టీ విద్యార్థులకు ఒరియంటేషన్‌

Orientation for IIFT students

బాలాజీచెరువు: జేఎన్‌టీయూకే ఐఈటీఈ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫారిన్‌ ట్రేడ్‌ కోర్సు ప్రథమ సంవత్సర విద్యార్థులకు సోమవారం ఒరియంటేషన్‌ నిర్వహించారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు ఇటీవల ఈ కోర్టులో చేరారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ వడ్లమూడి రవీంద్రసారథి సందేహాలు నివృత్తి చేశారు. ఐఐఎఫ్‌టీ పూర్వవిద్యార్ధి, క్లినియన్‌ సంస్థ డైరెక్టర్‌ వి.మనుజ్‌,మేడ్చెమ్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాడికొండ శేఖర్‌ హాజరయ్యారు.

Published date : 12 Sep 2023 03:13PM

Photo Stories