Skip to main content

No Reserved Posts Can Be De-Reserved- రిజర్వ్‌డ్ పోస్టులపై యూజీసీ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం

Reserved category seats in higher education  Reserved category seats in higher education   Government stance on SC, ST, OBC reservations  No Reserved Posts Can Be De-Reserved    Union Education Department

ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కేటాయించిన రిజర్వ్‌డ్ కేటగిరీ స్థానాలను అన్‌రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వెనుకబడిన అభ్యర్థుల కోసం రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్‌ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)చేసిన ప్రతిపాదనలపై విమర్శలు చెలరేగడంతో కేంద్ర విద్యాశాఖ స్పందించింది.

 

విద్యాసంస్థలకు కేంద్రం ఆదేశం
నేరుగా జరిపే నియామకాల్లో రిజర్వుడు స్థానాలను అన్‌ రిజర్వుడు చేయకూడని ప్రభుత్వం పేర్కొంది. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో టీచర్స్‌ కేడర్‌లో  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ కింద అన్ని పోస్టులకు 2019 చట్టం ప్రకారం.. రిజర్వేషన్ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరపాలని, అన్‌రిజర్వుడుగా మార్చకూడదని మంత్రిత్వ శాఖ అన్ని CEIలకు ఆదేశాలు ఇచ్చింది.

బ్యాక్‌లాగ్‌ పోస్టుల బాధ్యత వారిదే
దీనిపై యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్‌ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్‌లాగ్‌ పోస్టులు  భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. 

 

 

Published date : 29 Jan 2024 12:58PM

Photo Stories