Govt. Degree Colleges: అడ్మిషన్లు అంతంతే... ఇంజనీరింగ్ పైనే ఆసక్తి!
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివేందుకు విద్యార్థులు అంతగా అసక్తి చూపడం లేదు. జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన ఐదు కాలేజీల్లో ఇన్‌చార్జ్‌లే విధులు నిర్వహిస్తున్నారు. కళాశాలలపై అజమాయిషీ లేక బోధన అంతంతమాత్రంగానే ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.
Multiplier AI: హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు మూడు విడతలుగా ఆన్‌లైన్ (దోస్త్) ద్వారా విద్యార్థుల ప్రవేశాలకు అవకాశం కల్పించినా అడ్మిషన్లు నామమాత్రంగానే వచ్చాయి. కళాశాల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు అంతగా ఇష్టపడడం లేదు.
రెండేళ్లుగా అరకొరగానే..
ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎక్కువ మంది డిగ్రీ కోర్సుల్లో కాకుండా ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రెండు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. గతంలో ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించేవి. లేదంటే పైరవీల ద్వారా సీటు కోసం ప్రయత్నాలు జరిగేవి.
NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్ సీట్లు.. కారణం ఇదే..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు వచ్చిందంటే సర్కారు ఉద్యోగం వచ్చిందన్నంతగా విద్యార్థులు సంతోషపడేవారు. సీట్ల జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూసేవారు. కానీ నేడు దానికి పూర్తి భిన్నంగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలంటూ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బతిమాడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులు తగినంత మంది చేరకుంటే కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.
స్పెషల్ డ్రైవ్ పైనే ఆశలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ డ్రైవ్‌లో విద్యార్థులు చేరితే ఖాళీ సీట్లు కొంత మేరకై నా భర్తీ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఇంటర్ తర్వాత డిగ్రీ కాకుండా ఇంజనీరింగ్ వైపు వెళుతున్నారు. మరి కొందరు ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు.
– డాక్టర్ పి.పద్మ, ప్రిన్సిపాల్, ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల
TSPSC Group 4 Preliminary Key 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ప్రాథమిక ‘కీ‘
ఇంజనీరింగ్ పైనే ఆసక్తి
డిగ్రీ కళశాలల్లో సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారంతా ఇంజనీరింగ్ విద్య వైపు అసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళుతున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రెండు, మూడేళ్లుగా తగ్గింది.
– డాక్టర్ వై.చిన్నప్పయ్య, ప్రిన్సిపాల్, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు ఇలా..
కాలేజీ | సీట్లు | భర్తీ | ఖాళీలు |
పాల్వంచ | 480 | 233 | 247 |
కొత్తగూడెం | 300 | 125 | 175 |
భద్రాచలం | 700 | 360 | 340 |
మణుగూరు | 300 | 155 | 145 |
ఇల్లెందు | 300 | 117 | 183 |
సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల |
240 | 162 | 78 |
గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల |
300 | 200 | 100 |
Bengaluru: నెట్టింట వైరలవుతున్న ఆటోవాలా ఇన్ఫిరేషన్ జర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!