NMMS పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 10న నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గురువారం డీఈఓ ఎండీ అబ్దుల్‌హై తెలిపారు. 8వ తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థులు ఈపరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల, పరకాలలోని ఎస్సార్ హైస్కూల్‌ను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 10న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు హాల్‌టికెట్లతోపాటు బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్‌పెన్ తీసుకుని రావాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందు హాజరుకావాలని, హాల్‌టికెట్లు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు.