NCC Cadets Selections: ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ
సాక్షి ఎడ్యుకేషన్: ఢిల్లీలో ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా థాల్ సైనిక్ క్యాంప్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 24మంది బాలికలు ఎంపికై నట్లు తిరుపతి ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ డొంగ్ర కోటి తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్‌సీసీ నగర్‌లో సైనిక్ క్యాంప్‌కు ఎంపికై న గర్ల్ క్యాడెట్లకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30వేల మంది ఎన్‌సీసీ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారన్నారు.
UG Subjects: యూజీలో మేజర్ సబ్జెక్టుకు ప్రధాన ఎంపిక అమలు
అందులో ప్రతిభ చూపిన 24 మంది క్యాడెట్లను ఎంపిక చేసి పది వారాలపాటు కఠిన శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. క్యాంప్‌లో చేపట్టే పోటీల్లో విజేతలుగా నిలిచి తెలుగు రాష్ట్రాల పేరు నిలబెట్టాలని సూచించారు. క్యాడెట్లతోపాటు క్యాంప్‌కు లెఫ్ట్‌నెంట్ ఆన్‌మేరీ జోఫ్, నాయక్ సుబేదార్ అజిత్ కుమార్‌జా, హవల్దార్ అంకిరెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు. బాలికలకు మహ్మద్ షియాజుద్దీన్, జ్ఞానేశ్వర్, వంశీ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.