National Scholarship Portal: వెరిఫై అప్లికేషన్ లకు మాత్రమే స్కాలర్షిప్
సాక్షి ఎడ్యుకేషన్: ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ స్కాలర్‌షిప్ ఎన్‌ఎంఎన్‌ఎస్ 2023 సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల వివరాలు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాలను తప్పులు లేకుండా మెరిట్ కార్డుపై ముద్రించిన విధంగా ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్స్‌లో ఉండేవిధంగా పోర్టల్‌లో నవంబర్ 30లోగా నమోదు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల మోడల్ అధికారి డిసెంబర్ 15వ తేదీలోగా క్షుణ్ణంగా పరిశీలించి వివరాల నమోదు తీరును చూడాలని సూచించారు.
Formative Assessment: విద్యార్థులకు ఫార్మేటివ్-2 పరీక్షలు.. కానీ ఈ ఒక్క పేపరు మాత్రం!
నమోదు చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసి దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రం, బ్యాంకు, అకౌంట్ పాస్‌బుక్ మొదటి పేజీని జతపరచి డీఈఓ కార్యాలయానికి సమర్పించాలని చెప్పారు. జిల్లా మోడల్ అధికారి లాగిన్ ద్వారా వెరిఫై చేయించుకున్న అప్లికేషన్లకు మాత్రమే స్కాలర్‌షిప్ మంజూరవుతుందన్నారు. గత సంవత్సరాలలో ఈ పరీక్షకు ఎంపికై ప్రస్తుతం 10,11,12 తరగతులు చదువుతూ అర్హత కలిగిన ప్రతి విద్యార్ధి ఈ ఏడాది రెన్యువల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.