Fencing Competition: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు కొత్తగూడ విద్యార్థి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి మండంగి సంతోష్ జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ నిమ్మక మాధవరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్‌పీజీ స్కూల్ వేదికగా ఈనెల 15, 16వ తేదీలలో జరిగిన 67వ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో ఫెన్సింగ్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు బి.రాజ్‌కుమార్, మండంగి సంతోష్ వెళ్లారని, ఈపీ (ఈపీఈఈ) బాలుర విభాగంలో వారు ప్రతిభ చూపి రజత పతకం సాధించారని తెలిపారు. అలాగే ఈపీ ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో పాల్గొన్న మండంగి సంతోష్ ఉత్తమ ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్గిరిలో డిసెంబర్17, 18, 19వ తేదీలలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో సంతోష్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్‌ను హెచ్‌ఎం నాగరాజు, డిఫ్యూటీవార్డెన్ గంగారావు అభినందించారు.
చదవండి: Degree Exams: డిసెంబర్ చివరి వారంలో డిగ్రీ పరీక్షలు
Tags
- Fencing
- Fencing Competition
- National level Fencing Competition 2023
- Tribal Welfare Ashram High School
- Education News
- Kothaguda Tribal Welfare Ashram High School
- NationalFencingCompetition
- StudentAchievement
- FencingTalent
- SchoolSports
- AthleticAccomplishment
- FencingChampion
- Sakshi Education Latest News