NCSC: 31న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శన
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి నంద్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. పట్టణంలోని క్రాంతినగర్ శాంతినికేతన్ హైస్కూల్‌లో ప్రాజెక్టుల ప్రదర్శన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల తయారీలో శాసీ్త్రయ అంశాలైన పరిశీలన, సమాచార సేకరణ, ప్రయోగాలు, సమస్యల పరిష్కార మార్గాలు, అవగాహన, సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు కలిగిన ఉత్తమ సైన్స్ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 9948605546, 8919275298ను సంప్రదించాలన్నారు.
ఆయుధాలపై అవగాహన
బొమ్మలసత్రం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సావాలను పురస్కరించుకుని పోలీసులు వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక పోలీస్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి పోలీసులు ఆయుధాలు, పరికరా లు ఏ విధంగా ఉపయోగిస్తారో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో రక్షణ రంగంపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు. దీంతో పోలీసు, ఆర్మీలో చేరేలా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారన్నారు. అనంతరం వారికి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, మెటల్ డిటెక్టర్, డాగ్ సా్‌వ్క్‌డ్ తదితర విషయాల గురించి వివరించారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ అడ్మిన్ వెంకటరాముడు, ఎఆర్ అడిషినల్ ఎస్పీ చంద్రబాబు, డీఎస్పీ రంగముని, ఆర్‌ఐ సుధాకర్ పాల్గొన్నారు.
చదవండి: CBSE: సీబీఎస్‌ఈ విధానంపై అవగాహన తరగతులు
నంద్యాల ఆర్‌డీఓగా శ్రీనివాస్ కొనసాగింపు
నంద్యాల(అర్బన్): నంద్యాల ఆర్‌డీఓగా శ్రీనివాస్‌ను తిరిగి కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇక్కడి నుంచి చిత్తూరు డీఆర్‌ఓగా ఆయన బదిలీ అయ్యారు. అయితే మళ్లీ నంద్యాల ఆర్‌డీఓగానే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు వాల్మీకి మహర్షి జయంతోత్సవం
నంద్యాల(అర్బన్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద శనివారం ఉదయం 9.30 గంటలకు ఉత్సవాలను నిర్వహించున్నన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వాల్మీకులు, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, కుల, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
చదవండి: School Games: స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ప్రారంభం