Exam Fee: ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు తేదీ ఇదే..
Sakshi Education
కేయూ క్యాంపస్: ఎంటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 5 వరకు గడువు ఉందని, రూ.250 అపరాధ రుసుముతో డిసెంబర్ 8 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని వారు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.1300, బ్యాక్‌లాగ్స్ రెండు పేపర్లకుపైన రూ.1,200, బ్యాక్‌లాగ్స్ రెండు పేపర్ల వరకు రూ 600లు, ఇంప్రూవ్‌మెంట్ ప్రతీ పేపర్‌కు రూ.300ల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు.
చదవండి: New Degree Courses: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సు
Published date : 25 Nov 2023 11:25AM