New Degree Courses: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సు
సూళ్లూరుపేట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్ ఆనర్స్ విత్ రీసెర్చ్ అనే కొత్త కోర్సును ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్ ఎస్‌ఎల్‌బీ శంకరశర్మ తెలిపారు. కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం కొత్త కోర్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి కోర్సుకు రాష్ట్రంలోని మూడు కళాశాలలకు మాత్రమే అనుమతి లభించిందన్నారు. ఈ విద్యా సంవత్సరానికి 10 సీట్లు మాత్రమే కేటాయించినట్టు తెలిపారు. ఫిజిక్స్ విభాగాధిపతి వీ.రాజా మాట్లాడుతూ ఈ కోర్సులో ఉత్తీర్ణులైన తరువాత నేరుగా పీహెచ్‌డీ, ఎంటెక్ కోర్సులు చేయవచ్చని చెప్పారు. విదేశాల్లో ఎంఎస్ చేయవచ్చన్నారు. ఈ డిగ్రీతో ట్రిపుల్ ఐటీ, జూనియర్, రెసిడెన్సియల్, పాలిటెక్నిక్ కశాశాలల్లో అధ్యాపకులుగా ఉద్యోగావకాశాలు ఉంటాయ న్నారు. సీనియర్ అధ్యాపకులు వరప్రసాద్, ఎస్.శ్రీనివాస్, ఉషారాణి, సుబ్రమణ్యంశాస్త్రి, పీ.ఏడుకొండలు, ఏ.బాబు పాల్గొన్నారు.
చదవండి: Law Courses: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు
Tags
- degree colleges
- New Degree Courses
- New Courses
- New Course in Degree College
- Govt Degree College
- BSc Physics Honours with Research
- PhD courses
- MTech Courses
- Triple IT
- job opportunities
- Teachers
- Education News
- andhra pradesh news
- PrincipalSLBSankarasharma
- BScPhysicsHonors
- ResearchCourse
- GovernmentDegreeColleges
- TownCollege
- HigherEducation
- PhysicsProgram
- ResearchFocus
- CollegeAnnouncement
- AcademicUpdate
- Sakshi Education Latest News