Skip to main content

Tenth Students Score in Board: టెన్త్ ఫ‌లితాల్లో మైనార్టీ వెల్ఫేర్‌ బాలికల పాఠశాల విద్యార్థుల స‌త్తా..

గత నాలుగేళ్లుగా వంద శాతం ఉతీర్ణత సాధిస్తున్న విద్యార్థులు ఈసారి కూడా అలాగే నూరు శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. వారంద‌రి మార్కులు ఇలా..
100 percent Pass Rate Achievement at Balkonda School   Telangana Minority Welfare Girls School Students Celebrating Success  Minority Welfare Girls School Students Performance in 10th Results

బాల్కొండ: మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్‌ బాలికల పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. గత నాలుగేళ్లుగా వంద శాతం ఉతీర్ణత సాధిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కూడా నూరు శాతం ఉతీర్ణత సాధించారు.

అందరూ పాసయ్యారు..

మండల కేంద్రంలో మైనారిటీ పాఠశాల 2015–16 విద్యా సంవత్సరంతో ప్రారంభమైంది. పదో తరగతి 2020–21 విద్యా సంవత్సరంతో ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 39 మంది విద్యార్థులు పదో తరగతిలో చదివారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలను వెల్లడించారు. అందులో నూరు శాతం ఉతీర్ణత సాధించడంతో పాటు 111 మంది 10 జీపీఏ సాధించారు. 2021–22 విద్యా సంవత్సరంలో 39 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు.

Environmental Protection Awards: ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డులు.. ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు వీరే!

గరిష్టంగా ఒక్కొరికీ 9.8 జీపీఏ వచ్చింది. 2022–23 విద్యాసంవత్సరంలో 39 మంది విద్యార్థులు పరీక్ష రాసి అందరూ పాసయ్యారు. ఒక్కో విద్యార్థిని 10 జీపీఏ సాధించింది. 2023–24 విద్యా సంవత్సరంలో 36 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. అందులో ముగ్గురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. పాఠశాలలో క్రమం తప్పకుండ వారంతపు పరీక్షలు, స్టడీ అవర్స్‌, క్రమశిక్షణతో కూడిన విద్యను అందంచడంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని చెప్పొచ్చు.

Semi-Cryo Engine: సెమీ క్ర‌యోజ‌నిక్ ఇంజిన్‌ ప‌రీక్ష విజ‌య‌వ‌తం

ఉపాధ్యాయుల సహకారంతోనే

ఉపాధ్యాయుల సహకారంతోనే పదో పరీక్షల్లో 10 జీపీఏ సాధించాను. నిత్యం పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించారు. దీంతో పరీక్షలు సులభంగా రాయగలిగాను. ఆనందంగా ఉంది.

- సాహితి, 10 జీపీఏ

TS TET: టెట్‌పై నిర్ణయాధికారం పాఠశాల విద్య కమిషనర్‌కు ఉండదు: టీఎస్‌పీటీఏ

Published date : 07 May 2024 05:00PM

Photo Stories