Vikarabad Medical College: వచ్చే నెల నుంచే మెడికల్ తరగతులు.. వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి..!
మొదటగా అనంతగిరిలోని టీబీ శానిటోరియం భవనాల్లో తరగతుల నిర్వహించనున్నారు. 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు.
చదవండి: ఇకపై రోగులు విసిగించినా, దురుసుగా ప్రవర్తించినా వైద్యం బంద్
ఆలిండియా కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు కౌన్సిలింగ్‌తోపాటు అలాట్‌మెంట్, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కానుంది. కాలేజీ శాశ్వత భవన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. భవనం పూర్తయ్యే వరకు తరగతులను అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో నిర్వహిస్తారు. అలాగే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాసుపత్రిగా 380 పడకలతో అందుబాటులోకి తెస్తున్నారు.
చదవండి: తెలంగాణలో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...
మెడికల్ కాలేజీకి వివిధ విభాగాలకు 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. అనాటమీ, ఫిజియోలజీ, బయో కెమిస్ట్రీలకు సంబంధించి ల్యాబ్ పరికరాలను అందుబాటులో ఉంచారు. సెంట్రల్ లైబ్రరీ, విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేకంగా వసతి గృహాలు తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆసుపత్రి అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.